Bill Gates RBI Governor : ఆర్బీఐ గవర్నర్ తో బిల్ గేట్స్ భేటీ
కీలక అంశాలపై ప్రత్యేక చర్చలు
Bill Gates RBI Governor : ప్రపంచ మైటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు , బిల్ గేట్స్(Bill Gates) ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ను ప్రముఖ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్ తో పాటు ఆయన భార్య అంజలి కూడా ముంబైలో కలుసుకున్నారు. పిల్లలు, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, విద్య, సంరక్షణ, మహిళా సాధికారిత, ఆర్థిక అక్షరాస్యత, తదితర ప్రధాన రంగాలపై బిల్ గేట్స్ ఫౌండేషన్ పనిచేస్తోంది.
ఈ మేరకు కోట్లాది రూపాయలను వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తున్నారు . ఇందులో భాగంగా భారత దేశంలో గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల ప్రగతిని పరిశీలింంచేందుకు ఇక్కడికి వచ్చారు బిల్ గేట్స్.
అంతకు ముందు భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత దాస్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు బిల్ గేట్స్. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు శక్తి కాంత దాస్. ఆయనను ఘనంగా సత్కరించారు. ఆపై జ్ఞాపికను కూడా అందజేశారు ఆర్బీఐ గవర్నర్.
ఆర్థిక రంగానికి సంబంధించి పలు కీలక అంశాలపై మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఆర్బీఐ గవర్నర్(Bill Gates RBI Governor) శక్తికాంత దాస్ చర్చించారు. ప్రధానంగా క్రిప్టో కరెన్సీ వ్యవహారంపై చర్చ జరిగింది. క్రిప్టోను నిషేధించాలని పిలుపునిచ్చారు. జూదంతో సమానం ఇదని పేర్కొన్నారు. బిల్ గేట్స్ ఆర్బీఐ గవర్నర్ తో జరిగిన భేటీకి సంబంధించి ఆర్బీఐ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ చేసింది.
Also Read : టాప్ లో ఉన్నా తొలగించిన గూగుల్
LPG Cylinder Prices : సామాన్యులకు షాక్ గ్యాస్ ధరలు ఝలక్