Punjab CM Amit Shah : అమిత్ షాతో భగవంత్ మాన్ భేటీ
కీలక అంశాలపై చర్చించే ఛాన్స్
Punjab CM Amit Shah : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు(Punjab CM Amit Shah). అజ్నాలాలో స్వీయ శైలి బోధకుడు , ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ , అతడి మద్దతుదారులు అమృత్ సర్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో తన సహాయకుడిని విడుదల చేసేందుకు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత వారం జరిగిన ఘర్షణలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారితో సహా ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. భగవంత్ మాన్ అమిత్ షాతో భేటీ అవుతారని కానీ ఎజెండా ఏమిటి అన్నది బయటకు చెప్పలేదు. ఇదిలా ఉండగా పంజాబ్ లో కొలువు తీరిన ఆప్ సర్కార్ శాంతి భద్రతలను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై భగ్గుమన్నారు సీఎం భగవంత్ మాన్(Punjab CM). బీజేపీ రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించాలని డిమాండ్ చేసింది.
పోలీస్ సిబ్బందిపై దాడికి దిగిన అమృతపాల్ సింగ్ , అతడి మద్దతు దారులను అరెస్ట్ చేయాలని పంజాబ్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై సీఎం భగవంత్ మాన్ స్పందించ లేదు. ప్రస్తుతం సీఎంతో పాటు హోం శాఖను కూడా తానే నిర్వహిస్తున్నారు భగవంత్ మాన్. తమ ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించబోదని తెగేసి చెప్పారు. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు. ఈ తరుణంలో అమిత్ షాతో భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది.
Also Read : సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలం