Foxconn Invest : తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి
వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
Foxconn Invest : కేసీఆర్ ప్రభుత్వం కొలువు తీరాక పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, ఇతర రంగాలకు చెందిన కంపెనీలు హైదరాబాద్ ను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇక్కడి సర్కార్ పెట్టుబడిదారులకు, కంపెనీలకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా పరిశ్రమల పాలసీని తీసుకు వచ్చింది. ఇప్పటికే వందలాది కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి.
కేవలం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే కంపెనీలకు పర్మిషన్ ఇస్తుండడంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేరొందిన కంపెనీలన్నీ ఇక్కడ కొలువు తీరాయి. ఇదే సమయంలో కొత్త కంపెనీలు కూడా ఇక్కడికి వస్తుండడం విశేషం. గురువారం మరో బిగ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ షేర్ చేశారు ట్విట్టర్ లో.
ఫాక్స్ కాన్ సంస్థ(Foxconn Invest) తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. సీఎం కేసీఆర్ తో ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు సీఎం కేసీఆర్. ఇంకెన్ని కంపెనీలు వచ్చినా తాము సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు సీఎం.
ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూ సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. తాము తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
Also Read : జేఎన్యూలో రూల్స్ కఠినం