MLC Kavitha : బీజేపీ టార్గెట్ కేసీఆర్ నేను కాదు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్
MLC Kavitha BJP : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అసలు బీజేపీకి లక్ష్యమే కాదన్నారు. వాస్తవానికి సీఎం కేసీఆర్ టార్గెట్ అని తాను కాదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తాను లేనని చెప్పారు. తాను ఫోన్లను ధ్వంసం చేయలేదని పేర్కొన్నారు. ఏనాడైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు తన పేరును వెల్లడించాయా అని ప్రశ్నించారు. కేవలం భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులే తన గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారని ఇదంతా మైండ్ గేమ్ లో ఒక భాగమని ఆరోపించారు కల్వకుంట్ల కవిత.
కేంద్రంలో అధికారంలో ఉన్నామని బీజేపీ విర్ర వీగు తోందన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందని, అందుకే బీజేపీయేతర రాష్ట్రాలను, వ్యక్తులను, సంస్థలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా తాను ఏనాడూ కేంద్ర దర్యాప్తు సంస్థల పట్ల నిర్లక్ష్యం వహించిన దాఖలాలు లేవన్నారు. తాను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు సహకరిస్తూనే వచ్చానని ఆ విషయం ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పారు కల్వకుంట్ల కవిత(MLC Kavitha BJP).
ఇవాళ దేశంలో ఇద్దరు ముగ్గురు తప్ప ఏ ఒక్కరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు. వారిలో ఎంకే స్టాలిన్ , ఉద్దవ్ ఠాక్రే , విజయన్ , దీదీతో పాటు మా నాయిన కేసీఆర్ ఉన్నారని అన్నారు.
అందరి కంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ యుద్దం చేస్తున్నారని , ఆయన తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారని స్పష్టం చేశారు. దీనిని తట్టుకోలేకనే తనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు కవిత(MLC Kavitha BJP).
Also Read : పవర్ లోకి వస్తే రైతులకు పండుగ