Melanie Joly Jai Shankar : జై శంకర్ తో మెలానీ జోలీ భేటీ
జి20 ఎజెండాపై విస్తృత చర్చ
Melanie Joly Jai Shankar : కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(Melanie Joly Jai Shankar) తో శనివారం భేటీ అయ్యారు. జి20 ఎజెండాపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు ప్రపంచ పరిణామాలపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు మెలానీ జోలీ. రష్యాకు మద్దతు ఇవ్వకుండా చైనాను కూడా హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్యం, కనెక్టివిటీ , ద్వైపాక్షిక సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
అంతకు ముందు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జోలీ రష్యా, ఉక్రెయిన్ యుద్ద సమస్యను చేపట్టారు..మాస్కోను ఒంటరిగా ఉంచాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యుఎన్ భద్రతా మండలిని ప్రభావితం చేసేలా చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. రష్యాకు ఎక్కువ దేశాలు స్పష్టమైన సందేశాన్ని పంపితే , తాము రష్యాను రాజకీయంగా , దౌత్య పరంగా ఒంటరిగా ఉంచగలిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ.
రష్యాకు మద్దతు ఇవ్వడంపై ఆమె చైనాను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతిమంగా రష్యాను ఉక్రెయిన్ నుండి బయటకు తీసుకు రావడానికి తాము ఒక ఉద్యమాన్ని సృష్టించాలని పిలుపునిచ్చారు. చివరకు రష్యాకు మద్దతు ఇవ్వక పోవడమే ముఖ్యం అని చైనాకు సందేశం పంపాలన్నారు.
జై శంకర్(Jai Shankar) అధ్యక్షతన జరిగిన సమావేశంలో క్వాడ్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ , జపాన్ యోషి మాసా హయాషి, అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ హాజరయ్యారు.
Also Read : సామాజిక న్యాయానికి అవినీతి అడ్డంకి