PM Modi : మౌలిక సదుపాయాలు అభివృద్దికి దారులు
స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
PM Modi Infrastructure : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్దిని ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పరిగణిస్తోందన్నారు. ఇది 2047 నాటికి భారత దేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుందన్నారు నరేంద్ర మోదీ. అన్ని రంగాలలో ఆధునిక మౌలిక వసతుల(PM Modi Infrastructure) కల్పనకు కేంద్రం సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పారు. మౌలిక వసతుల కల్పన , పెట్టుబుడల పై బడ్జెట్ అనంతరం వెబ్ నార్ ను ఉద్దేశించి శనివారం ప్రధానమంత్రి ప్రసంగించారు.
ఈ ఏడాది బడ్జెట్ లో దేశంలో మౌలిక సదుపాయల రంగం వృద్దికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఈ మార్గాన్ని అనుసరించడం వల్ల మరింత బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఈ అభివృద్ది వేగాన్ని పెంచి టాప్ గేర్ లో వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు నరేంద్ర మోదీ.
గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. రోడ్లు , రైల్వేలు, ఓడ రేవులు, విమానాశ్రయాలు వంటి అన్ని రంగాల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పారు నరేంద్ర మోదీ(PM Modi). ఇది వ్యాపారాల పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు, లాజిస్టిక్స్ ఖర్చును సాధ్యమైనంత తగ్గించడంలో సహాయ పడుతుందని పేర్కొన్నారు దేశ ప్రధానమంత్రి. జి20 గ్రూప్ కు భారత దేశం నాయకత్వం వహించడం వల్ల మరికొంత ఫోకస్ పెడుతున్నామని తెలిపారు పీఎం.
Also Read : విప్రో దిగ్గజాలతో బిల్ గేట్స్