CARO Begumpet : తెలంగాణకు కేంద్రం శుభవార్త
విమానయాన పరిశోధన కేంద్రం
CARO Begumpet : గత కొంత కాలంగా ఉప్పు నిప్పు లాగా మారి పోయాయి కేంద్ర , రాష్ట్ర సంబంధాలు. తాజాగా కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి విమానాయన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ. 400 కోట్ల ఖర్చుతో బేగంపేట ఎయిర్ పోర్టులో ఈ పరిశోధన కేంద్రం (సీఏఆర్ఓ)ను(CARO Begumpet) ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అధికారికంగా కీలక ప్రకటన చేయడం విశేషం.
దీనిని దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో నిర్మించనున్నట్లు పేర్కొంది కేంద్రం. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయనుంది(CARO Begumpet). ప్రస్తుతం , రాబోయే మార్పులపై పరిశోధనలు ఇందులో చేయనున్నారు. ఈ ఏడాది జూలై నుంచే రీసెర్చ్ పనులు ప్రారంభించేలా చేయాలని ఆదేశించింది కేంద్ర సర్కార్.
ఈ కేంద్రంలో నెట్ వర్క్ ఎమ్యులేటర్ , ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కమ్యూనికేషన్స్ , ఎయిర్ పోర్టులు , ఎయిర్ నావిగేషన్స్ కు సంబంధించిన సేవలు, సౌకర్యాలపై ఫోకస్ పెడతారు. విజువలైజేషన్ – అనాలసిస్ ల్యాబ్స్ , నిఘా ల్యాబ్స్ , సైబర్ సెక్యూరిటీ థ్రెట్ అనాలిసిస్ ల్యాబ్స్ , నావిగేషన్ సిస్టమ్స్ , డేటా మేనేజ్ మెంట్ సెంటర్ , ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్ , సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ , టూల్స్ సెంటర్ , నెట్ వర్క్ మౌలిక సదుపాయాల పై ఇక్కడ పరిశోధనలు చేస్తారు.
ఈ కేంద్రం గనుక అందుబాటులోకి వస్తే వందలాది మంది నిపుణులు, కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read : మౌలిక సదుపాయాలు అభివృద్దికి దారులు