Venkaiah Naidu : జిల్లా కలెక్టర్లు తెలుగులోనే మాట్లాడాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Venkaiah Naidu Orders : మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలుగు భాష గొప్పదనం గురించి పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆంగ్ల భాష మోజు ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు వారి వారి స్వంత భాషల్లోనే మాట్లాడతాయని కానీ మన వరకు వచ్చే సరికల్లా ఇంగ్లీష్ ఒక వ్యామోహంలా, అంతకు మించి ఓ స్టేటస్ సింబల్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇక ఆయా రాష్ట్రాలలో పరిపాలనా పరంగా కీలకమైన పాత్ర పోషిస్తున్న జిల్లాల కలెక్టర్లు విధిగా తెలుగు భాష లోనే మాట్లాడాలని స్పష్టం చేశారు వెంకయ్య నాయుడు(Venkaiah Naidu Orders). దీని వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో తెలుస్తుందన్నారు. లేక పోతే వారి ఆవేదన వీరికి అర్థం కాదని అప్పుడు సమస్యలు జఠిలం అవుతాయని పేర్కొన్నారు. తాను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదన్నారు.
కానీ ఇదే సమయంలో మాతృ భాషను మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం హర్షణీయం కాదన్నారు. పర భాష వ్యామోహం ఉన్న భాషను మరిచి పోయేలా చేస్తోందని ఆవేదన చెందారు. ప్రధానంగా టెక్నాలజీ పెరగడం, మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రావడం వల్ల ఈ జాడ్యం మరింత ముదిరిందన్నారు. దీని వల్ల నష్టం తప్ప ఎంత మాత్రం లాభం లేదని పేర్కొన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు(Venkaiah Naidu).
Also Read : తెలంగాణకు కేంద్రం శుభవార్త