MLC Kavitha : త్వరలో ఐటీ హబ్ స్టార్ట్ – కవిత
పరిశీలించిన ఎమ్మెల్సీ
MLC Kavitha IT Hub : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు ప్రాంతాలలో ఐటీ హబ్ లను ఏర్పాటు చేసింది. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పలు చోట్ల టీ హబ్ లను ఏర్పాటు చేసింది. శనివారం కీలక ప్రకటన చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ నిజామాబాద్ లో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ (ఐటీ హబ్ ) ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మట్లాడారు కవిత(MLC Kavitha IT Hub) .
త్వరలోనే ఐటీ హబ్ ప్రారంభం కానుందని చెప్పారు. దీని వల్ల 700 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందన్నారు. పరోక్షంగా మరికొందరికి అవకాశం లభిస్తుందని చెప్పారు.
గతంలో పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కానీ తాము వచ్చాక అభివృద్దే ఎజెండా పని చేశామన్నారు. ఐటీ హబ్ భవన సముదాయాన్ని ఎమ్మెల్యే గణేష్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ గుప్తాతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ఇదిలా ఉండగా ఐటీ హబ్ లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రధాన నగరాలే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటీ విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అందులో భాగంగానే నిజామాబాద్ లో ఇవాళ త్వరలోనే రూపు దిద్దుకోనుందన్నారు. దీనిని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు కవిత(MLC Kavitha) .
అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్ ప్రారంభం అవుతుందన్నారు. మరికొన్ని పరిశ్రమలు కూడా రానున్నాయని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ.
Also Read : విశాఖకు నితిన్ గడ్కరీ ఖుష్ కబర్