Nirmala Sitharaman : వ్యాపారాల‌కు భార‌త్ గ‌మ్య‌స్థానం

విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

Nirmala Sitharaman – Raisina Dialogue 2023 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ్యాపారాల‌కు భార‌త దేశం గ‌మ్య‌స్థానంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. వృద్ది చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ముఖ్య‌మైన కార‌కాల క‌ల‌యిక ఈ దేశంలో ఉంద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్.

మ‌ధ్య త‌ర‌గ‌తి కొనుగోలు శ‌క్తితో కూడిన క్యాప్టివ్ మార్కెట్ , సాంకేతిక‌త‌తో న‌డిచే ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల‌తో స‌హా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ముఖ్య‌మైన అంశాలు ఇందులో ముడి ప‌డి ఉన్నాయ‌ని అన్నారు ఆర్థిక మంత్రి. ఉత్ప‌త్తులు, డిజిట‌ల్ వినియోగం, చ‌ట్ట నియ‌మాలు కీల‌కంగా మారాయ‌ని తెలిపారు.

న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన రైసినా డైలాగ్ లో(Nirmala Sitharaman – Raisina Dialogue 2023) ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు విత్త మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. ప్రైవేట్ రంగానికి అందుబాటులో లేని రంగం భార‌త దేశంలో లేద‌న్నారు. ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అమ్మే ప్ర‌య‌త్నంలో ఉంద‌న్న ప్ర‌తిప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌ను కొట్టి పారేశారు.

ప్ర‌భుత్వ రంగ విధానం స్ప‌ష్టంగా ఉంది. ప్ర‌తి దానిని అమ్మ‌డం లేద‌న్నారు. తాము విక్ర‌యిస్తున్నామ‌ని కానీ అమ్మ‌డం లేద‌న్నారు నిర్మ‌లా సీతారామ‌న్. జి20లో భార‌త్ గ్లోబ‌ల్ ప‌రంగా ద‌క్షిణాది గొంతును బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు ఆర్థిక మంత్రి. సుశిక్షుతులైన యువ‌త‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కొనుగోలు శ‌క్తి, సాంకేతిక‌త‌తో న‌డిచే పెట్టుడి ,ప్ర‌జా మౌలిక స‌దుపాయాలు భార‌త దేశ స్థిర‌మైన వృద్దికి కార‌ణాల‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆత్మ్ నిర్భ‌ర్ భార‌త్ ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య కాద‌న్నారు.

Also Read : న్యాయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించలేం – రిజిజు

Leave A Reply

Your Email Id will not be published!