Imran Khan Arrest : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఉద్రిక్తం
ఎలా అరెస్ట్ చేస్తారన్న మాజీ పీఎం
Imran Khan Arrest Protest : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తంగా మారింది. భారీ నిరసనల మధ్య మాజీ పీఎంను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడంతో గందరగోళం(Imran Khan Arrest Protest) నెలకొంది. ఇస్లామాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో లేరని , అరెస్ట్ నుంచి తప్పించు కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు ఇమ్రాన్ ఖాన్. తాను ఎక్కడికీ వెళ్లలేదని పేర్కొన్నారు.
పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీప్ రూ. 8 బిలియన్లకు పైగా మనీ లాండరింగ్ కేసులో దోషిగా నిర్దారించ బడనున్నారని ట్వీట్ చేశారు. విచారణలో ఉండగానే ఆయన ప్రధానమంత్రి అయ్యారంటూ ఆరోపించారు. ముందు పీఎంను అరెస్ట్ చేయాలంటూ పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. తన నివాసానికి చేరుకోగానే పాకిస్తాన్ ను బనానా రిపబ్లిక్ గా ఎలా మార్చారంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తల భారీ నిరసనల మధ్య తోషాఖానా కేసులో అరెస్ట్ చేసేందుకు లాహోర్ లోని పాకిస్తాన్ మాజీ పీఎం ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్(Imran Khan) గాయపడిన కారణంగా తోషాఖానా కేసు విచారణకు హాజరు కాలేదు. దీంతో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేస్తే పాకిస్తాన్ అగ్నిగుండం అవుతుందని ఆయన మద్దతుదారులు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాగా ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేశారా లేదా అన్నది ఇంకా పాకిస్తాన్ నుంచి తెలియ రాలేదు.
Also Read : పీయూసీ పరీక్షలో హిజాబ్ ఒప్పుకోం