Manish Sisodia Tortured : సిసోడియాను వేధిస్తున్న సీబీఐ – ఆప్
సంచలన ఆరోపణలు చేసిన పార్టీ
Manish Sisodia Tortured : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియ(Manish Sisodia) ప్రస్తుతం సీబీఐ కస్డడీలో ఉన్నారు. ఆయన కస్టడీని సోమవారం వరకు పొడిగించింది సీబీఐ కోర్టు. తాము వేసిన ప్రశ్నలకు ఏ ఒక్క దానికి సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. కస్టడీలో కావాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పేర్కొంది.
మనీష్ సిసోడియా(Manish Sisodia Tortured) అమాయకుడని, ఆయనకు ఏ పాపం తెలియదని పేర్కొంది. కానీ కేంద్రం కావాలని పన్నిన కుట్రలో సిసోడియా ఇరుక్కున్నాడని వాపోయింది.
కాగా 9 పార్టీలకు చెందిన నాయకులు, సీఎంలు సంయుక్తంగా లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. కేంద్ర ఆధీనంలోని దర్యాప్తు సంస్థలు కావాలని ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయంటూ వాపోయారు. దీనిపై నవ్వుకుంటూ ఊరుకున్నారు నరేంద్ర మోదీ. తమ పాత్ర ఏమీ లేదని కానీ దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ వెళతాయని స్పష్టం చేసింది కేంద్రం.
ఇక ఆప్ తాజాగా చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. మనీష్ సిసోడియా భార్యకు అనారోగ్యం ఉందని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ సీబీఐ అందుకు ఒప్పు కోలేదు. మొత్తం మద్యం పాలసీని మార్చి, రూ. 100 కోట్ల స్కాంకు పాల్పడ్డారని దీని వెనుక తతంగం నడిపిందంతా సౌత్ గ్రూప్ అంటూ పేర్కొంది. మరో వైపు సీఎం కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఇరుక్కుంది. రేపో మాపో ఆమెను కూడా లోపల వేసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
Also Read : రికార్డు స్థాయిలో ఎగుమతులు – గోయల్