BJP Slams Lalu Rabri Devi : సీబీఐ త‌న ప‌ని తాను చేస్తోంది

మాజీ సీఎం ర‌బ్రీ దేవి ఇంట్లో సోదాలు

BJP Slams Lalu Rabri Devi : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ సోమవారం బీహార్ మాజీ సీఎం ర‌బ్రీ దేవి ఇంట్లో సోదాలు జ‌రిపింది. భూ, జాబ్స్ స్కాంకు సంబంధించి ఆమెను ప్ర‌శ్నించింది. దీనిపై ఆర్జేడీ తో పాటు ఆప్ సీరియ‌స్ గా స్పందించింది. కావాల‌ని కేంద్రం బీజేపీయేత‌ర పార్టీలు, ప్రభుత్వాలు, నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందంటూ ఆరోపించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్. దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పందించింది.

దేశంలో సీబీఐ అనేది ఎక్క‌డికైనా వెళుతుంది. అది మోదీ చేతిలోనో లేదా కేంద్రం చేతిలో ఉంద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లేన‌ని పేర్కొంది.

సీబీఐ భార‌త రాజ్యాంగం ప్ర‌కారం స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌. త‌మ‌కు మాజీ సీఎంలు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ , ఆయ‌న భార్య ర‌బ్రీ దేవితో ఎలాంటి వ్య‌క్తిగ‌త విభేదాలు లేవ‌ని(BJP Slams Lalu Rabri Devi) పేర్కొంది. ఇదంతా కావాల‌ని చేస్తున్న ఆరోప‌ణ‌లు అని ఆరోపించింది. ఒక‌వేళ త‌ప్పు చేయ‌క పోతే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేసింది బీజేపీ.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తాను విత్తిన పంట‌నే పండిస్తున్నాడంటూ ఎగ‌తాళి చేసింది. ప్ర‌స్తుతం ఆర్జేడీ , జేడీయూ క‌లిసి బీహార్ లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. గ‌తంలో నితీష్ కుమార్ బీజేపీతో క‌లిసి స‌ర్కార్ ను కంటిన్యూ చేశారు. లాలూ ఇప్ప‌టికే దాణా కుంభ కోణం కేసులో దోషిగా ఉన్నారు. ప‌లు స్కాంల‌లో ఉన్న వాళ్లు కేంద్రాన్ని విమ‌ర్శిస్తే ఎలా అని మండిప‌డింది. త్వ‌ర‌లోనే దోషులు ఎవ‌రో తేలుతుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : య‌డియూర‌ప్ప‌కు త‌ప్పిన ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!