Rahul Gandhi : ఆర్ఎస్ఎస్ మ‌తోన్మాద తీవ్ర‌వాద సంస్థ

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కామెంట్స్

Rahul Gandhi RSS : ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ దాని అనుబంధ సంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై నిప్పులు చెరిగారు. లండ‌న్ లో ఇండియ‌న్ జ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సంభాష‌ణ‌లో తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆర్ఎస్ఎస్ ఇవాళ భార‌త దేశంలో మ‌తోన్మాద సంస్థ మాత్ర‌మే కాద‌ని తీవ్ర‌వాద సంస్థ‌గా మారిందంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కే కాదు వ్య‌వ‌స్థ‌లను నిర్వీర్యం చేయ‌డంలో ఆర్ఎస్ఆస్ కీల‌క పాత్ర పోషిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. లండ‌న్ కు చెందిన థింక్ ట్యాంక్ ఛాత‌మ్ హౌస్ లో నిర్వ‌హించిన సెష‌న్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. భార‌త దేశంలోని వివిధ సంస్థ‌లు ముప్పును ఎదుర్కొంటున్నాయ‌ని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అన్ని సంస్థ‌ల‌ను స్వాధీనం చేసుకుంద‌ని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi RSS) .

భార‌త దేశంలో ప్ర‌జాస్వామ్య పోటీ స్వ‌భావం పూర్తిగా మారి పోయింది. అది మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆర్ఎస్ఎస్ అనే ఛాంద‌స‌వాద‌, తీవ్ర‌వాద సంస్థ అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు దేశం గురించి ఏం మాట్లాడ‌కుండా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన షాకింగ్ కామెంట్స్ పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిప‌డింది. ఆ పార్టీకి చెందిన సీఎంలు హిమంత బిస్వా శ‌ర్మ‌, శివ‌రాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ , మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీ , అర్జున్ ముండా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : ప్ర‌చారం కోసం రాహుల్ దుష్ప్ర‌చారం

Leave A Reply

Your Email Id will not be published!