KTR Modi : అదానీపై ఈడీ ఎందుకు దాడి చేస్తలేదు
ప్రధానమంత్రి మోదీని ప్రశ్నించిన కేటీఆర్
KTR Modi ED : తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఎందుకు దాడి చేయడం లేదని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్(KTR Modi ED). గురువారం ఆయన ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే కేంద్రం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. తన సోదరి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తున్నారంటూ వాట్సాప్ యూనివర్శిటీలో ఎందుకు బీజేపీ ప్రచారం చేస్తోందంటూ నిలదీశారు.
తమకు చట్టం పట్ల గౌరవం ఉందని, కొందరు కాషాయానికి చెందిన న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికు మోదీ కొలువు తీరాక వందల కొద్దీ కేసులు నమోదు చేశారని ఇప్పటి వరకు చాలా కేసులు పరిగణలోకి రాలేదన్నారు. ఇదంతా బెదిరింపు రాజకీయాలలో భాగంగా జరుగుతున్న తతంగం అని ఆరోపించారు కేటీఆర్.
మా పార్టీకి చెందిన మంత్రులను టార్గెట్ చేశారు. గంగుల, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ పీఏ ఇంటిపై దాడి జరిగింది. జగదీశ్ రెడ్డి పీఏ, ఎంపీ నామా నాగేశ్వర్ రావు మీద మోదీ(PM Modi) ప్రభుత్వం దాడులు చేయించిందని ఇంతకు మించిన అప్రజాస్వామ్యం ఇంకేం ఉంటుందని నిలదీశారు కేటీఆర్(KTR).
అంతే కాదు పార్థ సారథిరెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ రమణ , మంచి రెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరినీ వదల లేదన్నారు మంత్రి. ఇంత మంది మీద దాడులు, సోదాలు జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకని అదానీ పై జరపడం లేదో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : ఈడీ సమన్లు కాదు మోదీ సమన్లు