ED Raids Tejashwi Yadav : తేజస్వి యాదవ్ కు ఈడీ షాక్
24 ప్రాంతాలలో మూకుమ్మడి దాడులు
ED Raids Tejashwi Yadav : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే భూ కుంభకోణంతో పాటు జాబ్స్ స్కామ్ విషయంలో బీహార్ మాజీ సీఎంలు రబ్రీ దేవి, లాలూ ప్రసాద్ యాదవ్ లను ప్రశ్నించింది. సోదాలు చేపట్టింది. శుక్రవారం ఈడీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం బీహార్ మహా ఘట్ బంధన్ సర్కార్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్(ED Raids Tejashwi Yadav) నివాసంలో సోదాలు చేపట్టింది.
ఆయన ఇంటితో పాటు 24 ప్రాంతాల్లో ఈడీ దాడులకు దిగింది. ఆయా కేసులకు సంబంధించి సాక్ష్యాలను సేకరించేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ రంగంలోకి దిగిందని సమాచారం.
విచారణకు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ లోని తేజస్వి యాదవ్ నివాసంతో పాటు ఎన్సీఆర్ , పాట్నా, రాంచీ, ముంబై లోని ప్రాంతాలలో దాడులు చేపట్టడం కలకలం రేపింది. కేంద్రం కావాలని కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీజేపీ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నందుకే దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అంతకు ముందు సీబీఐ ఢిల్లీలో లాలూ యాదవ్ ను, పాట్నాలో రబ్రీ దేవిని విచారించింది. బీజేపీ పూర్తిగా బీజేపీయేతర పార్టీలు, రాష్ట్రాలు, వ్యక్తులను టార్గెట్ చేసింది. ఇందుకు నిదర్శనం తామేనని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav).
2004 నుంచి 2009 మధ్య భారతీయ రైల్వే లోని వివిధ జోన్ లలో గ్రూప్ – డి పోస్టులలో మార్గదర్శకాలు పాటించకుండా నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. 2021 సెప్టెంబర్ లో సీబీఐ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఈడీ దాడులకు దిగింది.
Also Read : ప్రతిపక్షాల లేఖకు బీజేపీ కౌంటర్