Manish Sisodia ED : సిసోడియాను కస్టడీకి ఇవ్వండి – ఈడీ
10 రోజులు కావాలన్న కేంద్ర దర్యాప్తు సంస్థ
Manish Sisodia ED Seeks : తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వచ్చిన ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు(Manish Sisodia) కోలుకోలేని షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపించింది సీబీఐ. మొదట పాలసీపై విచారణకు ఆదేశించారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. సీబీఐ రంగంలోకి దిగింది మొదట. 34 మందిపై అభియోగాలు మోపింది. ఇందులో కీలక పాత్రర పోషించింది సిసోడియా అంటూ నెంబర్ 1 నిందితుడిగా పేర్కొంది.
అనంతరం ఈడీ రంగంలోకి దిగింది. ఏకంగా అరెస్ట్ చేసింది. కస్టడీకి తీసుకున్నా మనీష్ సిసోడియా సహకరించడం లేదని తలతిక్క సమాధానాలు చెబుతున్నాడంటూ ఆరోపించింది. అందుకే తమకు అదనంగా కస్టడీకి ఇవ్వాలని కోరింది. తీహార్ జైలులో ఉన్న మనీష్ సిసోడియాను ఈడీ అదుపులోకి తీసుకుంది. కోర్టులో శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం బెయిల్ కు సంబంధించి విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఈడీ కీలక కామెంట్స్ చేసింది.
తమకు మనీష్ సిసోడియాను(Manish Sisodia ED Seeks) విచారించేందుకు గాను 10 రోజుల కస్టడీ కావాలని కోరింది. తనభార్య ఆరోగ్యం బాగోదలేదని వెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మనీష్ సిసోడియా. అయితే బీజేపీ మాత్రం విచారణ సమయంలోనే అనారోగ్యం గుర్తుకు వచ్చిందా అంటూ మాజీ డిప్యూటీ సీఎంపై సెటైర్లు విసిరింది.
ఇదే సమయంలో సీబీఐ సమర్పించిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిసోడియాతో పాటు ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకుంది. ఇందులో సీఎం కేజ్రీవాల్ , ఎమ్మెల్సీ కవిత పేర్లు కూడా చేర్చింది.
Also Read : ఆధునిక ప్రహ్లాదుడు సిసోడియా