Sukesh Chandrasekhar : సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ ఖాయం – సుకేష్
చెప్పినట్టే సిసోడియా అరెస్ట్ అయ్యాడు
Sukesh Chandrasekhar Kejriwal : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేశ్ చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పటికే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యాడని, తర్వాత ఇక మిగిలింది ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని జోష్యం చెప్పారు.ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రమోటర్ భార్య నుండి రూ. 200 కోట్లకు పైగా తీసుకోవడంతో సహా 2017 నుండి అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మనీ లాండరింగ్ కేసులో తనపై అభియోగాలు నమోదు చేయడంపై మండిపడ్డాడు.
శుక్రవారం ఢిల్లీ కోర్టు ముందు హాజరయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తన పదవికి రాజీనామా చేసిన విషయం గురించి కూడా ప్రస్తావించాడు. మనీష్ సిసోడియా అరెస్ట్ కావడంతో నిజం గెలిచిందన్నాడు సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar). సత్యం విజయం సాధించింది.. పాపం పండింది..ఇక మిగిలింది అరవింద్ కేజ్రీవాల్. కేవలం అవినీతి అంతం పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత అరవింద్ కేజ్రీవాల్ ది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు చంద్రశేఖర్.
ఢిల్లీలోని జైలులో ఉన్నాడు. 30కి పైగా క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉంది సుకేశ్ కు. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ లో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చాడు. వీటిని పార్టీ కల్పిత వ్యూహంగా కొట్టి పారేసింది. ఇదంతా బీజేపీ కావాలని తమపై బురద చల్లేలా చేస్తోందని ఆరోపించారు సీఎం కేజ్రీవాల్. ప్రస్తుతం సుకేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar Kejriwal) చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Also Read : సిసోడియాను కస్టడీకి ఇవ్వండి – ఈడీ