Ramachandra Pillai Kavitha : అబ్బే అలా అన‌లేదు – పిళ్లై

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో ట్విస్ట్

Ramachandra Pillai Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం క‌ల‌క‌లం రేపుతోంది. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన ఈ కేసులో రోజు రోజుకు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 34 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. 11 మందిని అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి హైద‌రాబాద్ కు చెందిన వ్యాపార‌వేత్త అరుణ రామచంద్ర‌న్ పిళ్లై(Ramachandra Pillai Kavitha) మాట మార్చారు. సౌత్ గ్రూప్ లో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు తాను బినామీ అంటూ ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఉన్న‌ట్టుండి ట్విస్ట్ చోటు చేసుకుంది. లిక్క‌ర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న రామ‌చంద్ర‌న్ పిళ్లై ద‌ర్యాప్తు సంస్థ‌ల ఎదుట ఇచ్చిన వాంగ్మూలాన్ని వెన‌క్కి తీసుకున్నారు. ఇదే విష‌యాన్ని స్పెష‌ల్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం విశేషం. దీనికి ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కూడా కోరాడు. ఢిల్లీ లోని రౌస్ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్ర‌త్యేక కోర్టును ఆశ్ర‌యించారు రామ‌చంద్ర‌న్ పిళ్లై. అయితే కేసు విచార‌ణ‌కు స‌హ‌కారం అంద‌జేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది తెలంగాణ సీఎం కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు. ఆమె వాస్త‌వానికి 9న హాజ‌రు కావాల్సి ఉంది. అయితే మ‌హిళా బిల్లు రిజర్వేష‌న్ కావాల‌ని కోరుతూ మార్చి 10న శుక్ర‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష‌కు దిగింది.

మార్చి 11న శ‌నివారం ఈడీ ముందుకు వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేసింది. రేపు ఏం జ‌రుగుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. క‌విత‌ను విచారిస్తారా లేక అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి.

Also Read : అదానీ రోడ్ షోల‌పై మ‌హూవా సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!