KTR MLC Kavitha : కవితకు రక్షణగా కేటీఆర్
ఈడీ ముందుకు ఎమ్మెల్సీ
KTR Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ ముందుకు హాజరుకానుంది. ఇవాళ తెలంగాణ రాజకీయాలు ఉలిక్కి పడ్డాయి. ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సోదరుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హుటా హుటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోదరి కవితకు(KTR Kavitha) ధైర్యం చెప్పే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఎలా తప్పించు కోవాలనే దానిపై కల్వకుంట్ల కుటుంబం ఢిల్లీలో పేరొందిన న్యాయవాదులు , నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
పార్టీ పరంగా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, కేవలం బీజేపీ కావాలని వేధింపులకు గురి చేసేలా ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రోత్సహిస్తోందంటూ ఆరోపించారు కేటీఆర్(KTR Kavitha). కష్ట కాలంలో తన సోదరికి అండగా నిలిచేందుకు అక్కడే ఉన్నారు.
కవిత, కేటీఆర్ లు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఈడీ విచారణ ఎలా ఉండబోతోంది..అరెస్ట్ చేస్తే ఎలా ముందుకు సాగాలి అనే దానిపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించిందని ఈడీ ఆరోపించింది.
ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లను ధ్వంసం చేసిందని, ఆమె చెబుతున్నదంతా అబద్దమేనని ఈడీ కుండ బద్దలు కొట్టింది. తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని పేర్కొంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ కూడా అరెస్ట్ చేయొచ్చంటూ పార్టీ శ్రేణులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. కవిత అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత