Janasena Party Police : ఆంక్ష‌ల న‌డుమ ఆవిర్భావ స‌భ

అంద‌రి క‌ళ్లు జ‌న‌సేన స‌భ పైనే

Janasena Party Police : ఏపీలో రాజ‌కీయం వేడెక్కింది. నువ్వా నేనా అన్న రీతిలో మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఇవాళ కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నం వేదిక‌గా 10వ ఆవిర్భావ స‌భ జ‌రుగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది జ‌న‌సేన పార్టీ. 1,20,000 వేల మందికి పైగా హాజ‌రు కానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు నిర్వాహ‌కులు.

రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు జ‌న‌సైనికులు. ఇదిలా ఉండ‌గా ఎలాంటి ర్యాలీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించేందుకు వీలు లేద‌ని కృష్ణా జిల్లా పోలీస్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జాషువా(Janasena Party Police). స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇచ్చామ‌ని కానీ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిపేందుకు ఇచ్చినా తాము ఊరుకోబోమంటూ హెచ్చ‌రించారు. చ‌ర్యలు త‌ప్ప‌వ‌న్నారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు జ‌న‌సేన పార్టీ నిర్వాహ‌కులు.

ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఇదేనా ప్ర‌జాస్వామ్యం అంటే అని మండిప‌డ్డారు. మ‌రో వైపు ఆవిర్భావ స‌భ‌ను నిర్వ‌హించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహ‌కులు. 14 కిలోమీట‌ర్ల పొడ‌వునా ఉండి చూసేందుకు ఎల్ఇడిల‌ను ఏర్పాటు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సాయంత్రం 5 గంట‌ల‌కు ఆవిర్భావ స‌భ‌కు చేరుకుంటారు. ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు అన్నీ తానై నాదెండ్ల మ‌నోహ‌ర్. 2,000 మంది వాలంటీర్లు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు.

సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే జ‌న‌సేన పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. వీరంద‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉచితంగా నీళ్లు, మ‌జ్జిగ‌, ఆహారం అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా వైద్య స‌దుపాయం కూడా ఏర్పాటు చేశారు.

Also Read : జ‌న‌సేనానికి ‘నాదెండ్ల‌’ బ‌లం

Leave A Reply

Your Email Id will not be published!