RS Praveen Kumar : రాష్ట్ర‌ పాల‌న‌లో లీకులు..స్కాంలు

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar Slams : బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో చోటు చేసుకున్న పేప‌ర్ లీకేజీల వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఆర్ఎస్పీ. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పేప‌ర్ లీకులు, స్కాంలు, అవినీతికి కేరాఫ్ గా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారంపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar Slams). ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటున్నార‌ని ఈ స‌మ‌యంలో లీకుల వ్య‌వ‌హారం వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింద‌ని మండిప‌డ్డారు. దీనికి బాధ్యులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని అన్నారు బీఎస్పీ చీఫ్‌.

గ‌తంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్ష కూడా లీకై ఉండ‌వ‌చ్చ‌ని అభ్య‌ర్థులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆందోళ‌ణ వ్య‌క్తం చేశారు ఆర్ఎస్పీ. ఇదిలా ఉండ‌గా మంగళ‌వారం హైద‌రాబాద్ లో బీఎస్పీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు కార్య‌క‌ర్త‌లు. త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, విద్యార్థుల‌ను అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు .

అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. 1200 మంది అమ‌రులైన వారి ఆత్మ‌లు ఘోషిస్తున్నాయ‌ని ఈ దొర పాల‌న‌ను చూసి. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ స్పందించాల‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). క‌ష్ట‌ప‌డి చదివే వారి భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారుతుంద‌ని ఆవేద‌న చెందారు.

Also Read : పేప‌ర్ లీకుల‌పై బీఎస్పీ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!