BJYM Protest TSPSC Leak : పేపర్ లీకుపై బీజేవైఎం ఆందోళన
జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేయాలి
BJYM Protest TSPSC Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. దీనిపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీఎస్పీస్సీ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన(BJYM Protest TSPSC Leak) చేపట్టారు. టీఎస్పీస్సీ కార్యాలయం లోపటకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కొందరు గేటు ఎక్కేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.
ఇందుకు బాధ్యత వహించాల్సింది చైర్మన్ జనార్దన్ రెడ్డి అని, వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. గతంలో జరిగిన పరీక్షలపై కూడా విచారణ జరిపించాలని అన్నారు. జాబ్స్ నోటిఫికేషన్లు ఇచ్చినట్లే ఇచ్చి పేపర్లు లీక్ చేసి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ ఆరోపించారు. పరీక్ష పేపర్లను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును పీకేయడంతో ఉద్రిక్తంగా మారింది. పేపర్ లీకేజీలు ప్రగతి భవన్ డైరెక్షన్ లో జరుగుతున్నాయంటూ ఆరోపించారు బీజేవైఎం నాయకులు. ఇంజనీరింగ్ విభాగంలోని టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్ పేపర్ లీక్ తరహాలోనే గ్రూప్ వన్ , ఇతర పరీక్షలు కూడా ఇలాగే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
పరీక్ష పేపర్లను కాపాడు కోలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ఉండీ ఎందుకని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో తేలాలని అన్నారు.
Also Read : పేపర్ లీకులపై బీఎస్పీ ఆందోళన