BJYM Protest TSPSC : టీఎస్పీఎస్సీ బోర్డు ధ్వంసం..ఉద్రిక్తం
బీజేవైం కార్యకర్తల ఆందోళన..నిరసన
BJYM Protest TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీకుల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారతీయు జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు(BJYM Protest).
నాంపల్లిలోని ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆఫీసు గేట్లు దూకేందుకు ప్రయత్నం చేశారు బీజేవైం కార్యకర్తలు. దీంతో పోలీసులు రంగంలోకి దిగినా కార్యకర్తలు, నాయకులు వినలేదు.
ప్రగతి భవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకులు, అనుచరుల కోసమే పేపర్లను లీక్ చేశారంటూ ఆరోపించారు. వెంటనే దీనికి బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ లో నిద్ర పోతున్న సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. రాష్ట్రంలో పేపర్ లీకులు, స్కాంలకు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి చదువుకుంటున్న సమయంలో వారి ఆశలపై టీఎస్పీస్సీ(BJYM Protest TSPSC) నీళ్లు చల్లిందని అన్నారు.
పరీక్షలను నిర్వహించలేని స్థితిలో ఉన్న టీఎస్పీఎస్సీ ఉండీ ఏం లాభమని, దీనిని వెంటనే యుపీఎస్సీసీకి అనుసంధానం చేయాలని నిప్పులు చెరిగారు. అనంతరం పోలీసులు అడ్డుకున్నా వినకుండా గోడ పైకి ఎక్కారు కార్యకర్తలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును పీకి వేశారు. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. కల్వకుంట్ల కుటుంబం ప్రధాన కారణమని వెంటనే వారిపై విచారణ చేపట్టాలన్నారు.
Also Read : పేపర్ లీకుపై బీజేవైఎం ఆందోళన