Bandi Sanjay : దొంగ‌ల‌ను వ‌దిలేసి మా వాళ్ల‌పై కేసులా

నిప్పులు చెరిగిన బండి సంజ‌య్

Bandi Sanjay TSPSC BJP Cases :  తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ)లో చోటు చేసుకున్న పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేసిన బీజేవైఎం కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

ప్ర‌జ‌ల కోసం న్యాయం కోసం పోరాడుతున్న త‌మ పార్టీకి చెందిన బీజేవైఎం కార్య‌క‌ర్త‌ల‌పై కేసు(Bandi Sanjay TSPSC BJP Cases) ఎలా న‌మోదు చేస్తారంటూ ప్ర‌శ్నించారు. అరెస్టులు, జైళ్లు, కేసులు త‌మ‌కు కొత్త కాద‌న్నారు. న‌మ్మిన సిద్దాంతం కోసం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం త‌మ క‌ర్త‌వ్య‌మ‌న్నారు బండి సంజ‌య్.

ప్ర‌శ్నా ప‌త్రాల లీకేజీ జ‌రిగింద‌ని సాక్షాత్తు చైర్మ‌న్ జ‌నార్ద‌న్ రెడ్డి చెబుతున్నార‌ని అస‌లు ఇలా జ‌ర‌గడానికి కార‌ణం ఎవ‌ర‌నే దానిపై ముందు తేలాల‌న్నారు. ఆయ‌న చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నార‌ని సిట్ తో ఎలాంటి న్యాయం జ‌ర‌గ‌ద‌న్నారు. సిట్టింగ్ జ‌డ్జితో ఈ మొత్తం లీకు వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టాల‌ని బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. లీకు వీరుల వెనుక ఎవ‌రు ఉన్నారో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

గ‌తంలో సిట్ ఏర్పాటు చేసిన ఏ కేసులో అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాలేద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్ . ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సిట్ నిర్వాకం ఏమిటో తెలిసి పోయింద‌న్నారు. డ్ర‌గ్స్ కేసు, న‌యీం కేసు , డేటా చోరీ స‌హా సిట్ కు అప్ప‌గించిన ఈ కేసు స‌రిగా బ‌య‌ట‌కు రాలేద‌ని ఆవేద‌న చెందారు. వెంట‌నే అరెస్ట్ చేసిన బీజేవైఎం నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను విడుద‌ల చేయాల‌ని బండి సంజ‌య్(Bandi Sanjay) డిమాండ్ చేశారు.

Also Read : అన్ని ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!