MLC Kavitha : తప్పు చేయను ఎవరికీ భయపడను
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్
MLC Kavitha Mahila Bill : తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె మార్చి 11న ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఏకంగా 9 గంటల పాటు ఈడీ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆమెకు మార్చి 16న మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఒక మహిళను ఈడీ విచారణకు పిలిపించ వచ్చా అని ప్రశ్నిస్తూ తనకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత.
తనను ఈడీ విచారణ చేయకుండా స్టే విధించాలని, తాను మహిళనని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిని తాము పరిగణలోకి తీసుకోమని , ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని స్పష్టం చేసింది. ఈడీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 24కు తిరిగి కేసు విచారణ చేపడతామని అంత వరకు వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఇదిలా ఉండగా మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని కోరుతూ కల్వకుంట్ల కవిత మార్చి 10న జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టింది.
బుధవారం మరోసారి ఇదే అంశానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా బిల్లును(MLC Kavitha Mahila Bill) పెట్టడంలో మోదీ సర్కార్ వైఫల్యం చెందిందని ఆరోపించింది. అందుకే తాను పోరాటం చేస్తున్నానని చెప్పింది కల్వకుంట్ల కవిత. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : కవితకు షాక్ ‘సుప్రీం’ ఝలక్