MLC Kavitha ED : ఈడీ విచారణ కవిత హాజరయ్యేనా
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీకి చుక్కెదురు
MLC Kavitha ED Case : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజు రోజుకు మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి మార్చి 16న ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె కొత్త స్లోగన్ అందుకుంది మహిళలకు రిజర్వేషన్ బిల్లు కావాలని. బుధవారం ఢిల్లీ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం కూడా చేపట్టింది. మరో వైపు తనకు ఈడీ విచారణ(MLC Kavitha ED Case) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇది ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే ఈడీ మార్చి 11న 9 గంటల పాటు ప్రశ్నించింది. ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారని, బుచ్చిబాబు, రామచంద్రన్ పిళ్లై తో ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు పిడికిలి బిగించింది. బయటకు వచ్చాక నవ్వుతూ కనిపించింది.
కానీ ఉన్నట్టుండి కోర్టును ఆశ్రయించడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. చట్టం ముందు ఎవరైనా సమానమేనని స్పష్టం చేసింది. స్టే ఇచ్చేందుకు వీలు పడదని పేర్కొంది. దీంతో ఈడీ నుంచి ఇప్పటికే నోటీసులు అందుకుంది ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).
మరి రేపు గురువారం ఈడీ ముందుకు వెళుతుందా లేక ఇంకేమైనా జరుగుతుందా అన్న ఉత్కంఠ తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరు ఉన్నారనేది ఇప్పటికే ఈడీ కుండ బద్దలు కొట్టింది. రేపు ఏం జరుగుతుందనే దానిపై నే టెన్షన్ నెలకొంది.
Also Read : తప్పు చేయను ఎవరికీ భయపడను