MLC Kavitha : కవితపై థర్డ్ డిగ్రీ నిజమేనా
పిటిషన్ లో సంచలన ఆరోపణలు
MLC Kavitha 3rd Degree : ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీకి చెందిన లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ మద్యం స్కాంపై విచారణకు ఆదేశించడంతో అసలు కుంభకోణం బట్ట బయలు అయ్యింది. సీబీఐ 34 మందిపై కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈడీ 11 మందిని అదుపులోకి తీసుకుంది. ఈ ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఊహించని రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను(MLC Kavitha) ఈడీ విచారణ చేపట్టింది.
మార్చి 11న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.05 గంటల వరకు విచారించింది. ఇదే సమయంలో ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న రావాలని స్పష్టం చేసింది. అంతకు ముందు మార్చి 10న మహిళా బిల్లును చేపట్టాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టింది కవిత. ఇది తెలంగాణ జాగృత సంస్థ దీనిని చేపట్టింది. ఇదే క్రమంలో మార్చి 15న ఢిల్లీలోని మెరిడియన్ హోటల్ లో మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ చర్చ చేపట్టింది. ఇందులో 12 పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
16న తాను హాజరు కాకుండా ఉండేలా ఈడీని నిలువరించాలని, స్టే విధించాలని, తనపై వేధింపులకు పాల్పడ్డారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని , రాత్రి వరకు విచారణ(MLC Kavitha 3rd Degree) చేపట్ట కూడదని చట్టంలో ఉందని, తనకు మినహాయింపు ఇవ్వాలంటూ కోరారు సుప్రంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒప్పుకోలేదు. స్టే ఇచ్చేందుకు కుదరదని స్పష్టం చేసింది. దీంతో కవితకు బిగ్ షాక్ తగిలింది.
Also Read : కవిత ఈడీ విచారణపై ఉత్కంఠ