MLC Kavitha Skip : ఈడీ విచారణకు కవిత డుమ్మా
ఆరోగ్యం బాగోలేదంటూ సమాచారం
MLC Kavitha Skip : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha Skip) ఉన్నట్టుండి రూట్ మార్చింది. మార్చి 16న గురువారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనంటూ ఆప్ ఎమ్మెల్యే, ప్రముఖ లాయర్ సోము భరత్ ద్వారా ఈడీ ఆఫీసుకు సమాచారం పంపింది. తన ఆరోగ్యం బాగా లేదని, తన శరీరం విచారణకు సహకరించడం లేదని పేర్కొంది. అందుకే ఈడీ వద్దకు హాజరు కాలేక పోతున్నట్లు స్పష్టం చేసింది.
కావాలనే డుమ్మా కొట్టిందనే ఆరోపణలు లేక పోలేదు. తనకు బదులుగా పత్రాలను పంపడం, ఈమెయిల్ ద్వారా సమాచారం పంపింది ఈడీకి. దీనిపై ఈడీ ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోను రావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. దీంతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఈడీ సమన్ల వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందంటూ ఆరోపించారు కవిత(MLC Kavitha). అంతకు ముందు ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తనను వేధిస్తున్నారని , థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని , ఒక మహిళను రాత్రి వరకు ఎలా విచారిస్తారంటూ ప్రశ్నించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు ఒప్పు కోలేదు. కానీ సహకరించాల్సిందేనంటూ స్పష్టం చేసింది కోర్టు. ఈ తరుణంలో డుమ్మా కొట్టడం విస్తు పోయేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో 11 మందిని అరెస్ట్ చేసింది. ఇవాళ బుచ్చిబాబు, పిళ్లైతో కలిసి విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Also Read : ఢిల్లీలో కవిత విచారణపై ట్విస్ట్