Arvind Kejriwal : ఢిల్లీని చెత్త రహితంగా మారుస్తాం
సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal New Delhi : వచ్చే ఏడాది మార్చి నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఇందుకు సంబంధించి రెట్టింపు వేగంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే ఢిల్లీని చెత్త రహితంగా మారుస్తామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో సీబీఐ మరో కేసు మనీష్ సిసోడియాపై నమోదు చేయడాన్ని తప్పు పట్టారు సీఎం. కేంద్ర సర్కార్ కావాలని కుట్ర లో భాగంగానే ఆయనను జైలులో పెట్టిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా ధర్మం చివరకు గెలుస్తందన్నారు. మనీష్ సిసోడియా త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.
కేంద్రం నియమించిన లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆధ్వర్యంలోనే తాము ప్రతిపాదించిన మద్యం పాలసీపై సంతకం చేశారని మరి ఆయనను కూడా విచారణ చేపట్టాలని అన్నారు. ఇదంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పథకం మని ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు ఢిల్లీ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో తమకే ఢిల్లీ నగర వాసులు ఓటు వేశారని ఆ విషయం కూడా తెలుసు కోకుండా కావాలని పదే పదే వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal New Delhi). వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పాలన సాగిస్తున్న బీజేపీ సర్కార్ కు త్వరలోనే ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు ఢిల్లీ సీఎం.
Also Read : కవితపై ఈడీ విచారణ చట్ట విరుద్దం