Opposition Human Chain : ఢిల్లీలో ప్రతిపక్షాల మానవహారం
అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై ఆగ్రహం
Opposition Human Chain : పార్లమెంట్ లో గౌతం అదానీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న బంధం ఏమిటంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోది. మరో వైపు ఈడీ ఎందుకు విచారణ చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. అదానీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంట్ దగ్గర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మానవహారం(Opposition Human Chain) చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ముందు నుంచీ అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన ఎంపీలు నోటికి నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాజ్యసభ వెల్ లోకి ప్రవేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్ సభ లోనూ ఇదే నిరసన వ్యక్తం అయ్యింది. ప్రిసైడింగ్ ఆఫీసర్లు రాకుండానే టీఎంసీ ఎంపీలు లోపలికి ప్రవేశించారు.
బీజేపీకి చెందిన మంత్రులు, ఎంపీలు ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారు..మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. తమను తాము వ్యక్తీకరించేందుకు కూడా అంగీకరించ లేదని మండిపడ్డారు. మరో వైపు రాహుల్ క్షమాపణ చెప్పాలని బీజేపీ మంత్రులు, ఎంపీలు కోరుతున్నారు.
ఇక నిరసన వ్యక్తం చేసిన వారిలో డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ, బీఆర్ఎస్ , సీపీఎం , సీపీఐ , ఎస్ఎస్ , జేడీయూ , జేఎంఎం, ఎండీఎంకే , ఆప్ , వీసీకే , ఐయూ ఎంఎల్ నేతలు ఉన్నారు. వీరంతా ఖర్గే ఆధ్వర్యంలో సమావేశం అయ్యారు. పార్లమెంట్ ను నడపకుండా చేయాలన్నదే మోదీ సర్కార్ కుట్ర అని ఖర్గే ఆరోపించారు.
Also Read : ఢిల్లీని చెత్త రహితంగా మారుస్తాం