MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట
హమ్మయ్య గండం గడించింది
Kavitha ED Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా రాలేనంటూ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కవితకు సంబంధించి న్యాయమూర్తి సామ భరత్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, మార్చి 24న విచారణకు రానుందని ఆ తీర్పు వచ్చాక తమ క్లయింటు ఈడీ ముందు విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు. సామ భరత్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళ అని చూడకుండా ఈడీ విచారణ చేపట్టడం దారుణమన్నారు. 24 తర్వాత ఒప్పుకునే ప్రసక్తి లేదని , మార్చి 20న విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది ఈడీ(Kavitha ED Case).
ఇదిలా ఉండగా తనను ఈడీ విచారణ చేపట్టకుండా ఉండేలా సుప్రీంకోర్టు స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ పై సీరియస్ గా స్పందించింది. ఇదేమంత విచారించాల్సిన అవసరం లేదని , స్టే ఇవ్వడం కుదరదంటూ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జనజాగృతి సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీలోనే కొలువు తీరారు.
మరో వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకు వ్యవహారం కలకలం రేపుతోంది. మొత్తంగా ఊపిరి పీల్చుకుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హమ్మయ్య గండం గడిచిందంటూ హైదరాబద్ కు బయలు దేరినట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారం కలకలం రేపింది.
Also Read : 20న ఎమ్మెల్సీ కవిత రావాల్సిందే