Bhagwant Mann : అవినీతి రహిత పంజాబ్ లక్ష్యం
ఆ దిశగా కృషి చేస్తున్నానన్న సీఎం
AAP 1 Year Punjab : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాటితో పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం(AAP 1 Year Punjab) పూర్తయింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భగవంత్ మాన్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ప్రజలందరికీ మెరుగైన పాలన అందించడమే తన ముందున్న లక్ష్యమన్నారు సీఎం.
ఎన్నికల సందర్భంగా ఆప్ ఇచ్చిన హామీలను చాలా వరకు పూర్తి చేశానని చెప్పారు భగవంత్ మాన్. ప్రత నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ , యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, మొహల్లా క్లినిక్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని రంగ్లా పంజాబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు పంజాబ్ సీఎం.
భారీ అంచనాలు , ఆశల మధ్య ఆప్ ప్రభుత్వం ఎన్నికైంది. ఒక ఏడాది పాలన పూర్తి చేసుకుంది విజయవంతంగా. ఇందుకు సహకరించిన ప్రజలు, ఇతర వర్గాలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు సీఎం. ఆప్ కు భారీ విజయాన్ని కట్టబెట్టారని, చరిత్ర లో నిలిచి పోయేలా చేశారన్నారు. ఇప్పటికే గన్ కల్చర్ ను కంట్రోల్ లోకి తీసుకు వచ్చానని అన్నారు. ప్రభుత్వంలోనే కాదు ఎక్కడా అవినీతికి పాల్పడినా తాను ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు.
ఒక సంవత్సరం లోనే 14 వేల మందికి జాబ్స్ ఇచ్చామన్నారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు కింద పని చేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేసినట్లు తెలిపారు. చట్ట పరమైన అడ్డంకులు తొలిగాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను కూడా పర్మినెంట్ చేస్తామన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నామని చెప్పారు.
Also Read : ఢిల్లీలో ప్రతిపక్షాల మానవహారం