RS Praveen Kumar : సీబీఐతో విచారణ చేపట్టాలి – ఆర్ఎస్
చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలి
RS Praveen TSPSC KCR : నిరుద్యోగులకు న్యాయం జరగాలని కోరుతూ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్న బి. జనార్దన్ రెడ్డిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శాంతియువత దీక్షను భగ్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం పేపర్ లీకుల వ్యవహారంలో సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి(RS Praveen TSPSC KCR) పాత్ర ఉందంటూ మండిపడ్డారు. సీఎంఓకు టీఎస్ పీస్సీకి మధ్య లింకు ఉందని దీని కారణంగానే పేపర్లు లీక్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జరిగిన పరీక్షలతో పాటు ప్రస్తుతం జరగబోయే పరీక్షలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఏజెంట్లు కాన్ఫిడెన్షియల్ లో తిష్ట వేశారంటూ ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2016లో జరిగిన గ్రూప్ -1 పరీక్షలో కూడా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అభ్యర్థులు ఎంపికయ్యారని మండిపడ్డారు. కవిత, హరీష్ రావు, కేటీఆర్ కు వీరితో ఏం పని ఉందని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. సిట్ వల్ల ఉపయోగం లేదని అన్నారు. డీజీపీ ఏమీ చేయలేరన్నారు. ఆర్టికల్ 317 ప్రకారం జనార్దన్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen) డిమాండ్ చేశారు. ప్రవీణ్ కు 103 మార్కులు ఎలా వస్తాయని నిలదీశారు. ఇలాంటి వాళ్లను ఎలా నియమిస్తారంటూ మండిపడ్డారు. మీరు ఎన్ని అరెస్ట్ లు చేసినా తమ పోరాటం ఆగదన్నారు.
Also Read : వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్