KTR TSPSC : లీక్ బాధాకరం కొలువులు భర్తీ చేస్తాం
ఆందోళన చెందవద్దన్న మంత్రి కేటీఆర్
KTR TSPSC : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న లీక్ వ్యవహారంపై ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. లీక్ జరగడం బాధాకరమని , ఇక నుంచి పూర్తి పారదర్శకతతో కొలువులు భర్తీ చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం వెంటనే స్పందించిందని, సిట్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకుందన్నారు. ఇదే క్రమంలో అభ్యర్థులకు అన్యాయం జరగ కూడదనే ఉద్దేశంతో గ్రూప్ -1 పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు కేటీఆర్(KTR TSPSC).
శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే దీనిని ప్రతిపక్షాలు రాజకీయంగా మైలేజ్ కోసం అనవసర ఆందోళన చేపడుతున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. టీఎస్ పీఎస్సీకి దేశంలో మంచి పేరుందని పేర్కొన్నారు.
ఎవరో ఒకరు తప్పు చేస్తే దానిని అందరికీ ఆపాదించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లను విడుదల చేసిందని , కానీ దీని వెనుక బండి సంజయ్ కుట్ర ఉందంటూ ఆరోపించారు కేటీఆర్. ఆయనకు దాని పట్ల అవగాహన లేదన్నారు. ఈ మొత్తం లీక్ వ్యవహారం వెనుక బీజేపీ ఉందని మండిపడ్డారు మంత్రి.
యువత ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు కేటీఆర్(KTR). ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరగనీయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు , లీకులు జరగకుండా చూస్తామని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. బండి దద్దమ్మ అని రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు.
Also Read : లీకుల పర్వం ‘కల్వకుంట్ల’ హస్తం