PM Modi Congratulate : ఏపీ విద్యార్థుల‌కు మోదీ అభినంద‌న

క‌లిసిన 8,9వ త‌ర‌గ‌తి స్టూడెంట్స్

PM Modi AP Students : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన వారితో ఆహ్లాదంగా గ‌డిపారు. అంత‌కు ముందు వారు ఎలా చ‌దువు కుంటున్నార‌ని అడిగారు. జీవితంలో రాణించాలంటే క‌ష్ట‌ప‌డాల‌ని ప్ర‌ధాన‌మంత్రి(PM Modi AP Students) సూచించారు.

విద్యావంతులైతేనే స‌మాజం బాగు ప‌డుతుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా న‌రేంద్ర మోదీని క‌లిసిన వారిలో ఏపీలోని విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం , వైఎస్సార్ క‌డ‌ప జిల్లాల‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు చెందిన 8వ, 9వ త‌ర‌గ‌తుల‌కు చెందిన 42 మంది విద్యార్థులు ఢిల్లీలో ప‌ర్య‌టించారు.

రెండు రోజులు ఢిల్లీలోనే ఉన్నారు. విద్యా ప‌రట‌న‌లో భాగంగా వారు దేశ రాజ‌ధానిలో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రిని క‌లుసుకున్నారు. వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు ప్ర‌ధాన‌మంత్రి. ప్ర‌తి ఒక్క‌రికీ జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు. పిల్ల‌ల‌తో పాటు ఉన్న టీచ‌ర్ల‌ను కూడా అభినందించారు.

స‌మాజంలో అస‌లైన గుర్తింపు కేవ‌లం చ‌దువు కోవ‌డం ద్వారానే వ‌స్తుంద‌న్నారు. తాను కూడా ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొన్నాన‌ని కానీ ఏనాడూ ఆందోళ‌న‌కు, భ‌యానికి గురి కాలేద‌న్నారు. చ‌దువు కోవ‌డం ద్వారానే మ‌న స‌త్తా ఏమిటో తేలుతుంద‌న్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ(PM Modi).

భార‌త దేశ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను నేర్చు కోవాల‌ని, పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వ భావం క‌లిగి ఉండాల‌ని సూచించారు ప్ర‌ధాన‌మంత్రి. ఇదే క్ర‌మంలో ఏపీకి చెందిన ఎంద‌రో మ‌హానుభావులు ఉన్నార‌ని వారిని గుర్తించి వారు సాధించిన విజ‌యాలు ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

అల్లూరి సీతారామ రాజు, గుర‌జాడ అప్పారావు, పింగ‌ళి వెంక‌య్య లాంటి మ‌హానుభావులు పుట్టిన నేల అని తెలిపారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఇదిలా ఉండ‌గా ఏపీ విద్యార్థుల‌ను అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ధ‌న్యవాదాలు తెలిపారు ఏపీ రాష్ట్ర మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి.

Also Read : రామ్ చ‌ర‌ణ్ కు అమిత్ షా స‌న్మానం

Leave A Reply

Your Email Id will not be published!