Jai Shankar Rahul Tharoor : జై శంకర్..రాహుల్..థరూర్ వైరల్
ఫోటో షేర్ చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి
Jai Shankar Rahul Row : అరుదైన దృశ్యానికి వేదికైంది న్యూ ఢిల్లీ. జి20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత దేశం అంతటా 50 నగరాల్లో 200 సమావేశాలకు విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది మోదీ సర్కార్. ఇదిలా ఉండగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం భారత జి20 అధ్యక్ష పదవిపై సంప్రదింపుల కమటీకి అధ్యక్షత వహించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(Jai Shankar Rahul Row). నిన్నటి దాకా రాహుల్ గాంధీపై కేంద్ర సర్కార్ నిప్పులు చెరిగింది.
ప్రస్తుతం ఆయన క్షమాపణలు చెప్పాలంటూ ఏకంగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో జై శంకర్ పై కూడా నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తాను ఎందుకు క్షమాపణలు చెప్పాలంటూ నిలదీశారు..రాహుల్ కు మద్దతుగా నిలిచారు ఎంపీ శశి థరూర్. ఈ తరుణంలో సంప్రదింపుల కమిటీ సమావేశానికి ప్రతిపక్షాలను ఆహ్వానించారు జై శంకర్.
ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, ఎంపీ శశి థరూర్ , టీఎంసీకి చెందిన ఎంపీ శతృఘ్న సిన్హా, శివసేన యుబీటి నాయకురాలు ప్రియాంక చతుర్వేది సహా పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. జై శంకర్(Jai Shankar) కమిటీ సభ్యులతో కలిసి నిలబడి ఉన్న ఫోటోను పంచుకున్నారు.
ఈసందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ఇదిలా ఉండగా విదేశాలలో భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్. ఈ తరుణంలో జై శంకర్ అందరితో కలవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : సుప్రీం లక్ష్మణ రేఖను దాటితే ఎలా – రిజిజు