Amrit Pal Singh : పంజాబ్ లో బిగ్ ట్విస్ట్..హై అల‌ర్ట్

అమృత పాల్ అరెస్ట్ కాలేదు

Amrit Pal Singh High Alert : ఖ‌లిస్తానీ లీడ‌ర్ అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. అత‌డిని వెంబ‌డించి అరెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇంట‌ర్నెట్ సేవ‌లు రాష్ట్రంలో పూర్తిగా నిలిపి వేసిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఆదివారం సాయంత్రం వ‌ర‌కు ఈ సేవ‌లు ఉండ‌వ‌ని పేర్కొంది. అంత‌కు ముందు ఢిల్లీ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కేంద్ర హోం శాఖ అమిత్ చంద్ర షాతో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. వీరి భేటీలోనే అమృత పాల్ సింగ్ ను(Amrit Pal Singh) ప‌ట్టుకోవ‌డ‌మో లేక లేకుండా చేయాల‌నే దానిపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా అమృత పాల్ సింగ్ అరెస్ట్ వ్య‌వ‌హారం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. విచిత్రం ఏమిటంటే శ‌నివారం అరెస్ట్ అయిన‌ట్లు జాతీయ మీడియా కోడై కూసింది. అమృత్ పాల్ సింగ్ ఇంకా అరెస్ట్ కాలేదు. మోటార్ సైకిల్ పై వేగంగా వెళుతున్న అమృత పాల్ సింగ్ ను ప‌ట్టుకునేందుకు భారీ ఆప‌రేష‌న్ ప్రారంభించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో రాష్ట్రంలో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

పంజాబ్ పోలీసుల క‌న్నుత‌ప్పి ప‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కేంద్ర బ‌ల‌గాలు కూడా పంజాబ్ కు చేరుకున్నాయి. ఇంకా గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. జ‌లంధ‌ర్ లో మోటార్ సైకిల్ పై వేగంగా వెళుతున్న అమృత పాల్ సింగ్ ను ప‌ట్టుకునేందుకు భారీ ఆప‌రేష‌న్ ప్రారంభించారు(Amrit Pal Singh High Alert).

అమృత్ పాల్ సింగ్ సార‌థ్యం వ‌హిస్తున్న వారిస్ పంజాబ్ దే సంస్థ‌కి చెందిన 78 మంది స‌భ్యుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురు అమృత పాల్ సింగ్ ముష్క‌రులు కూడా ఉన్నార‌ని జ‌లంధ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ కుల్దీప్ సింగ్ చాహ‌ల్ వెల్ల‌డించారు.

Also Read : పంజాబ్ లో టెన్ష‌న్ టెన్ష‌న్

Leave A Reply

Your Email Id will not be published!