Nityananda Kailasa : ‘కైలాస’ స‌రిహద్దు లేని దేశం – నిత్యానంద

మీడియా ప్ర‌శ్న‌ల‌కు కీల‌క స‌మాధానాలు

Nityananda Kailasa : తాను ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశానికి స‌రిహ‌ద్దులు లేవ‌ని స్ప‌ష్టం చేశారు వ్య‌వ‌స్థాప‌కుడు, వివాదాస్ప‌ద గురు నిత్యానంద‌. ప‌త్రికా ఆఫీస్ దేశం, దాని త‌త్వ శాస్త్రం , రాజ్యాంగం , మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌తిస్పందించారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిత్యానంద ప్రెస్ సెక్ర‌ట‌రీ స‌మాధానం ఇచ్చారు. కైలాస గురించి మ‌రింత తెలుసు కోవాల‌కునే రిజిస్ట‌ర్డ్ మీడియా సంస్థ‌ల నుండి ప్ర‌శ్న‌ల‌ను ఆహ్వానించింది.

కైలాస ప్రామాణిక‌త గురించి అడిగిన‌ప్పుడు కార్యాల‌యం పురాత‌న జ్ఞానోద‌యం పొందిన హిందూ నాగ‌రిక‌త దేశం పున‌రుజ్జీవ‌నం అని పేర్కొన్నారు. స‌రిహ‌ద్దులు లేని , సేవా ఆధారిత దేశంగా కైలాస‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఐక్య రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యంలో గుర్తింపు పొందిన ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌హుళ స్వ‌చ్చంధ సంస్థ‌ల ద్వారా ప‌ని చేస్తుంద‌న్నారు.

దాని వెబ్ సైట్ ప్ర‌కారం సావ‌ర‌న్ ఆర్డ‌ర్ ఆఫ్ మాల్టా అనేది 1113 నుండి కాథ‌లిక్ చ‌ర్చి సాధార‌ణ‌మైన మ‌త‌ప‌ర‌మైన క్ర‌మం. అధికారికంగా యున్ చే గుర్తించ బ‌డింద‌న్నారు. వాస్త‌వానికి దేశానికి సంబంధించి పూర్తిగా ప‌వ‌ర్ లో లేక పోయిన‌ప్ప‌టికీ 100 రాష్ట్రాల‌తో దౌత్య సంబంధాల‌ను క‌లిగి ఉంద‌ని స్పష్టం చేశారు. నిత్యానంద కైలాస(Nityananda Kailasa) దేశం అనేక సంస్థ‌లు, వివిధ దేశాల‌లోని ఎన్జీఓలు , దేవాల‌యాలు , మ‌ఠాల ద్వారా ప‌ని చేస్తుంద‌ని స‌మాధానం ఇచ్చింది. లింగం, జాతి, జాతీయ‌త‌, రంగు, కులాల‌కు అతీతంగా ప్ర‌పంచ శాంతిని ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు.

2019 నుండి అజ్ఞాతంలో ఉన్న నిత్యానంద ఉన్న‌ట్టుండి దేశం విడిచి పారి పోయాడు. కైలాస దేశాన్ని ఏర్పాటు చేశాడు. ప్ర‌ముఖ మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు స్వ‌తంత్ర నివేదిక‌ల ద్వారా నిత్యానంద‌కు క్లీన్ చిట్ ఇచ్చార‌ని పేర్కొంది కైలాస‌.

Also Read : అమృత పాల్ సింగ్ పై మ‌రో కేసు

Leave A Reply

Your Email Id will not be published!