MLC Kavitha : ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేనా

సుప్రీంకోర్టులో కేవియ‌ట్ పిటిష‌న్ దాఖ‌లు

MLC Kavitha Attend : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మార్చి 20న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది(MLC Kavitha Attend). ఇప్ప‌టికే ఆమె కేటీఆర్ , కొంద‌రు న్యాయ నిపుణుల‌తో క‌లిసి రాజ‌ధానికి చేరుకున్నారు. అంత‌కు ముందు మార్చి 16న హాజ‌రు కావాల్సి ఉండ‌గా సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశాన‌ని , మార్చి 24న విచార‌ణ జ‌ర‌గ‌నుంద‌ని అందుకే ఆ త‌ర్వాత వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేసింది. మ‌హిళ‌కు ఉన్న రూల్స్ ను ఈడీ అతిక్ర‌మించిందంటూ ఆరోపించింది.

అంతే కాదు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని, త‌న ఫోన్ ను సీజ్ చేశారంటూ వాపోయింది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌ను విచారించ‌కుండా ఈడీని ఆదేశించాల‌ని పిటిష‌న్ లో పేర్కొంది. దీనిపై విచారించిన ధ‌ర్మాస‌నం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పింది. మ‌నీ లాండ‌రింగ్ కు సంబంధించిన వ్య‌వ‌హారం క‌నుక ఈడీ ముందుకు హాజ‌రు కావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది.

న్యాయ నిపుణుల‌ను సంప్ర‌దించిన క‌విత ఇవాళ ఈడీ ముందుకు హాజ‌ర‌వుతారా లేక మ‌రేదైనా కార‌ణం చెప్పి త‌ప్పించుకుంటారా అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. ఇప్ప‌టికే ఆమె మార్చి 11న ఈడీ ముందు హాజ‌రైంది. 9 గంట‌ల పాటు విచారించింది ఈడీ.

ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ఆమె ఇప్ప‌టికే ఢిల్లీకి చేరుకుంది. క‌విత(MLC Kavitha) వెంట భ‌ర్త అనిల్ , సోద‌రుడు మంత్రి కేటీఆర్ , కొంద‌రు న్యాయ నిపుణులు ఉన్నారు. సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మందిని అరెస్ట్ చేసింది.

Also Read : ఎమ్మెల్సీ క‌విత..బుచ్చిబాబుపై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!