Amrit Pal Singh Operation : పంజాబ్ లో ఆప‌రేష‌న్..టెన్ష‌న్

ప‌ట్టుకునేందుకు పోలీసుల ప్లాన్

Amrit Pal Singh Operation : ఖ‌లిస్తాన్ వేర్పాటు వాద నాయ‌కుడు అమృత పాల్ సింగ్ ను (Amrit Pal Singh) ప‌ట్టుకునేందుకు ఆప‌రేష‌న్ పంజాబ్ లో కొన‌సాగుతోంది. కొత్త కేసులో ఖ‌లిస్తానీ నాయ‌కుడిని నిందితుడు నంబ‌ర్ వ‌న్ గా పేర్కొన్నారు. శ‌నివారం నుంచి ఆప‌రేష‌న్ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించారు. రాష్ట్ర మంత‌టా జ‌ల్లెడ ప‌డుతున్నారు.

అమృత పాల్ సింగ్ అనుచ‌రుల‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేశారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌కుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బ‌ల‌గాలు రంగంలోకి దిగాయి(Amrit Pal Singh Operation). ఇదే స‌మ‌యంలో సింగ్ కు మ‌ద్ద‌తుగా పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టారు మ‌ద్ద‌తుదారులు. లండ‌న్ లోని భార‌త హైకమిష‌న్ వ‌ద్ద జాతీయ ప‌తాకాన్ని తీసి వేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఈ కేసును ఉగ్ర‌వాద ద‌ర్యాప్తు గా స్వీక‌రించేందుకు కేంద్రం పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. అగ్ర‌శ్రేణి ఉగ్ర‌వాద నిరోధ‌క సంస్థ నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అక్ర‌మ ఆయుధాలు క‌లిగి ఉన‌నార‌నే ఆరోప‌ణ‌ల‌పై అమృత పాల్ సింగ్ , ఏడుగురు స‌హాయ‌కుల‌ను విచారించ‌వ‌చ్చు. అనుచ‌రుల‌ను అస్సాంలోని దిబ్రూషూర్ పంపించారు. క‌ఠిన‌మైన జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టం (ఎన్ఎస్ఏ) కింద అభియోగాలు మోపారు.

ఇది దేశంలోని ఏ జైలు లోనైనా పోలీసులు నిందితుల‌ను నిర్బంధించేందుకు అనుమ‌తిస్తుంది. ఇంకా ఆప‌రేష‌న్ కంటిన్యూగా కొన‌సాగుతూనే ఉంది. పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మార్చి 2న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. అమృత్ పాల్ సింగ్ వ్య‌వ‌హారంపై చ‌ర్చించారు. ఆ వెంట‌నే ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు.

Also Read : భార‌త హైక‌మిష‌న్ పై దాడి

Leave A Reply

Your Email Id will not be published!