SIT Issued Notice : టీపీసీసీ చీఫ్ కు సిట్ బిగ్ షాక్
ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీస్
SIT Issued Notice : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారం. ఇప్పటికే చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ తప్పు లేదని ఇద్దరు చేసిన నిర్వాకం కారణంగా ఇది చోటు చేసుకుందని తెలిపారు.
మొదట ఒక్కటే పేపర్ లీక్ అయ్యిందన్నారు. ఆ తర్వాత అన్ని పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించింది టీఎస్ పీస్సీ. వాటికి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు శ్రీకారం చుట్టింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చాయి.
రేణుక, రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ , తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. చైర్మన్ ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. లీకుల వ్యవహారం రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దిద్దుబాటు చర్యలకు దిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
సిట్ ఇప్పటికే విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా ఈ పేపర్ లీకుల వెనుక కేటీఆర్ ఫ్యామిలీ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో(SIT Issued Notice) పాటు పలువురికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ , చైర్మన్ జనార్దన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్ బండి సంజయ్ , బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే ఇవ్వాలని కోరుతూ నోటీసు జారీ చేసింది.
Also Read : గీత దాటితే చర్యలు తప్పవు