Priyanka Gandhi : కేంద్రం అధికార దుర్వినియోగం
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
Priyanka Gandhi Modi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ఆరోపించారు. కేంద్రం ఒత్తిడి మేరకే ఢిల్లీ పోలీసులు తమ సోదరుడు , అగ్ర నేత రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
అధికారం ఉంది కదా అని ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రజలను తన మాయ మాటలతో మోసం చేయలేదా అని నిలదీశారు. ఏ ప్రాతిపదికన నోటీస్ ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా భారత్ జోడో యాత్ర సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న సమయంలో మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ చేసిన ప్రకటనను పరిగణలోకి తీసుకున్నారు.
ఆ బాధితులు ఎవరో , వారికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ నోటీస్ అందజేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ఆదివారం తన నివాసం వద్దకు వెళ్లారు. గంట పాటు బయటే వేచి ఉన్నారు. 10 రోజుల్లో తాను సమాధానం ఇస్తానని తానే కారు నడుపుకుంటూ వెళ్లి పోయారు రాహుల్ గాంధీ.
ఆయన అక్కడి నుంచి కర్ణాటకకు వెళ్లారు. మూడు రోజుల పర్యటనలో ప్రస్తుతం అక్కడే ఉన్నారు. తన సోదరుడికి నోటీసు ఇవ్వడంపై ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi Modi). పోలీసులు నేరుగా రాలేదని కేంద్రం కేంద్ర సర్కార్ ఒత్తిడి వల్లనే నోటీసు అందజేశారని ఫైర్ అయ్యారు ప్రియాంక గాంధీ.
Also Read : రాహుల్ గాంధీ మోదీకి బిగ్ టీఆర్పీ