MLC Kavitha ED Leaves : ముగిసిన ఎమ్మెల్సీ క‌విత విచార‌ణ

10.30 గంట‌ల దాకా కొన‌సాగిన విచార‌ణ

MLC Kavitha ED Leaves : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ త‌న‌య ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ విచార‌ణ సోమ‌వారం ముగిసింది(MLC Kavitha ED Leaves). ఉద‌యం 10.30 గంట‌ల‌కు వెళ్లిన క‌విత రాత్రి 9.20 నిమిషాల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు. దాదాపు ప‌దిన్న‌ర గంట‌ల పాటు విచార‌ణ ఎదుర్కొంది. ఈడీ ఇవాళ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి వ్యాపార‌వేత్త అరుణ్ రామ‌చంద్ర‌న్ పిళ్లై , మ‌నీష్ సిసోడియాతో పాటు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను విచారించింది.

గంట గంట‌కు టెన్ష‌న్ నెల‌కొంది. చివ‌ర‌కు ఉత్కంఠ‌కు తెర దించింది ఈడీ. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఆవు పులి క‌థ‌ను గుర్తు చేసింది. అంద‌రినీ క‌లిపి విచారించింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. ఆమె విచార‌ణ స‌మ‌యంలో ముగ్గురు లాయ‌ర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్ల‌డం , వైద్య సిబ్బంది బృందం ఆఫీసు లోప‌లికి వెళ్ల‌డం మ‌రింత ఉత్కంఠ‌ను రేపింది.

చివ‌ర‌కు ఈడీ తేల్చింది ఏమీ లేదు. వైద్య టీంలో ఓ మ‌హిళా డాక్ట‌ర్ కూడా ఉండ‌టం కొంత అనుమానం క‌లిగించింది. రాత్రి 9.15 అయినా క‌ల్వ‌కుంట్ల క‌విత బ‌య‌ట‌కు రాక (MLC Kavitha) పోయేస‌రికి ఏమైనా జ‌రగ‌బోతోందా అన్న అనుమానం నెల‌కొంది బీఆర్ఎస్ శ్రేణుల్లో. ఒక‌వేళ అరెస్ట్ చేస్తారా అన్న ప్ర‌చారం చోటు చేసుకుంది. అంద‌రి అంచ‌నాలు ప‌టాపంచ‌లు చేస్తూ క‌విత బ‌య‌ట‌కు వ‌చ్చారు. వాహ‌నంలోకి ఎక్కుతూ విక్ట‌రీ సింబ‌ల్ చూపించారు. నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లారు న‌వ్వుకుంటూ.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఈడీ ఆమెకు నోటీసు ఇచ్చిందా లేక మరోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌వుతుందా అన్న‌ది తేలాల్సి ఉంది.

Also Read : సీడీపీఓ..ఈవో ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!