TDP Meeting Hyd : రేపు హైదరాబాద్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం..
TDP Meeting Hyd : ఆంధ్రప్రదేశ్ లో తెలుగ దేశం పార్టీ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలో నూతనోతేజాన్ని నింపాయి. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఇప్పుడు అదే ఊపుతో తెలంగాణ లోనూ పార్టీ బలోపేతంపై టీడీపీ(TDP Meeting Hyd) దృష్టిసారించింది. ఏం చేయాలి అన్నదానిపై ప్లాన్ యాక్షన్ రెడీ చేయనున్నారు. ఇందులో భాగంగా రేపు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వడమే లక్ష్యంగా చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనుంది టీడీపీ.
ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా పోరాటాలు, సంస్థాగత పటిష్టతపై కార్యాచరణ సిద్దం చేయనుంది టీడీపీ . తెలంగాణ ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోనుంది టీడీపీ. చాలా కాలం తరువాత హైదరాబాదులో పొలిట్ బ్యూరో మీటింగ్ జరగనుండడంతో ఏం చర్చిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. మేలో జరిగే మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై పొలిట్ బ్యూరోలో(TDP Meeting Hyd) చర్చ జరగనుంది.
ముఖ్యంగా ఈ సమావేశం టీడీపీకి చాలా కీలకం కానుంది. ఎందుకంటే నాలుగేళ్ల తరువాత టీడీపీకి విజయాలు దక్కాయి. గెలుపు కోసం మొహం వాచిపోయిన సైకిల్ పార్టీకి.. తాజా విజయాలు బూస్టర్ డోస్ లా మారాయి. ఆ ఉత్సాన్ని రెండు రాష్ట్రాల్లో కొనసాగించే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది పాలిట్ బ్యూరో సమావేశం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చ – తీర్మానాలు వుంటాయి.
Also Read : ఉచిత విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికి కుట్ర