TSRTC Big Updates : ఆర్టీసి ప్రయాణికులకు బిగ్ షాక్.. రద్దీని బట్టి టికెట్ ధర..!

TSRTC Big Updates : తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు రకరకాల ప్రయోగాలు.. వినూత్న మార్పులు, నిర్ణయాలు తీసుకుంటుంది యాజమాన్యం. తాజగా దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్ ధరను ఇక నుంచి రద్దీని బట్టి పెంచడం తగ్గించడం చేయనున్నారు అధికారులు. ఈ మేరకు ఆర్టీసీ వైపు వచ్చేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఫైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.

హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్‌, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

విమానాలు, హోటళ్లు, ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్‌ ప్రైసింగ్‌ను.. త్వరలోనే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయమున్న సర్వీస్‌లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం (TSRTC Big Updates) కసరత్తు చేస్తుంది.

ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్‌ ధరల్లో హెచ్చు తగ్గులు జరగడమే డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం ఉంటుందని.. రద్దీ తక్కువగా ఉంటే సాధారణ చార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్‌ ధర ఉంటుందన్నారు ఎండి సజ్జనార్.

డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో అడ్వాన్స్‌డ్‌ డేటా అనాలసిస్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయన్నారు.

ప్రైవేట్‌ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్‌ ధరను వెల్లడిస్తాయని సజ్జనార్ తెలిపారు. సాధారణ రోజుల్లోనూ ప్రైవేట్‌ ఆపరేటర్లు అధికంగా చార్జీలు వసూలుచేస్తున్నారు. రద్దీ రోజుల్లో అయితే టికెట్ల ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారన్నారు.

ప్రైవేట్‌ పోటీని తట్టుకుని.. ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని టీఎస్‌ఆర్టీసీ(TSRTC) యాజమాన్యం నిర్ణయించింది. ఈ విధానం వల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణ చార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది.

ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్‌ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్‌ ధర ఉంటుంది.” ఆన్‌లైన్ బుకింగ్‌ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Also Read : పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన !

Leave A Reply

Your Email Id will not be published!