Bhadrachalam Kalyanam : భద్రాద్రి సీతారాముల తలంబ్రాలకు ఫుల్ డిమాండ్..
Bhadrachalam Kalyanam : శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు లక్ష మంది పైగా రామయ్య భక్తులు హాజరయ్యారు.
సీతారాముల కల్యాణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగగా.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు.
చినజీయర్ స్వామి సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఎంతో నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో(Bhadrachalam Kalyanam) తలంబ్రాలుగా ఉపయోగించారు.ఈ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
కాగా.. శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి సీఎం కేసీఆర్ కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో సీతారాముల కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సీతారాముల విగ్రహాలను ఈ ఏడాది సువర్ణ ద్వాదశ వాహనాలపై ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ వాహనంలో స్వామి వారిని ఊరేగించేవారు. ఇటీవల ఆ వాహనాలకు మరమ్మతులు పూర్తిచేయడంతో వేదపండితులు తిరిగి ఆ క్రతువును ప్రారంభించారు.
Also Read : ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్