Balagam Awards : బలగం చిత్రానికి అవార్డుల పంట
వాషింగ్టన్ డీసీ ఫెస్టివల్ లో నాలుగు అవార్డులు
Balagam Awards : దిల్ రాజు సమర్పణలో చిత్రం వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రం రికార్డుల మోత మోగిస్తోంది. పల్లెటూరి నేపథ్యంగా సాగే ఈ మూవీకి అవార్డులు వరిస్తున్నాయి. అంతర్జాతీయ పరంగా బలగంకు అనేక పురస్కారాలు దక్కాయి. ఇప్పటి దాకా లాస్ ఏంజెల్స్ , ఉక్రెయిన్ ఫిల్మ్ అవార్డులు(Balagam Awards) దక్కాయి. తాజాగా అమెరికా లోని వాషింగ్టన్ డీసీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో నాలుగు కేటగిరీలలో బలగంకు పురస్కారాలు లభించాయి. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది అధికారికంగా.
బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ కింద వేణు, బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ ఫ్యూచర్ కేటగిరి కింద హీరో ప్రియదర్శికి, బెస్ట్ యాక్టరెస్ ఇన్ ఏ ఫ్యూచర్ విభాగం కింద హీరోయిన్ కావ్య కళ్యాణ్ రాంకు , బెస్ట్ నెరేటివ్ ఫ్యూచర్ కింద దర్శకుడికి అవార్డులు దక్కడం విశేషం.
అంతకు ముందు లాస్ ఏంజెల్స్ సినిమాటోగ్రఫీ అవార్డుల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ , బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో రెండు అవార్డులు దక్కాయి బలగం చిత్రానికి(Balagam Awards). అంతే కాకుండా ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో బలగం చిత్రానికి పురస్కారం లభించింది. ప్రస్తుతం బలగం గోస్ గ్లోబల్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతోంది ట్విట్టర్ లో.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకంగా పల్లెతనపు జీవితాన్ని సినిమాలో ప్రతిఫలించేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సంతోషం లో తేలి యాడుతోంది.
Also Read : ఐదు భాషల్లో పవన్ కళ్యాణ్ OG టైటిల్ రిజిష్టర్..