ED Focus TSPSC : పేప‌ర్ లీకేజీపై ఈడీ న‌జ‌ర్

సిట్ తో పాటు ఈడీ విచార‌ణ‌

ED Focus TSPSC : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిందిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం రోజు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన సిట్ (స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీం) విచార‌ణ జ‌రుపుతోంది. లీకుల వ్య‌వ‌హారం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టి వ‌ర‌కు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప‌రీక్ష ప్ర‌శ్నా ప‌త్రాల లీకులో డ‌బ్బులు చేతులు మారాయ‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌నే దానిపై కూడా ఆరా తీస్తోంది. మ‌రో వైపు ప్ర‌తిప‌క్షాలు చైర్మ‌న్ , స‌భ్యులు, కార్య‌ద‌ర్శిని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

ఓ వైపు సిట్ ద‌ర్యాప్తు చేస్తుండ‌గానే మ‌రో వైపు కేంద్రానికి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)(ED Focus TSPSC) రంగంలోకి దిగింది. ఇవాల్టి నుంచి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ చేప‌ట్ట‌నుంది. దీంతో అక్ర‌మార్కులు, అవినీతి ప‌రుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. వీరి వెనుక ఎవ‌రి హ‌స్తం ఉంద‌నేది ఈడీ తేల్చ‌నుంది. ప‌బ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాల మేర‌కు ఈడీ కేసు న‌మోదు చేయ‌డం విశేషం.

హ‌వాలా ద్వారా డ‌బ్బులు చేతులు మారిన‌ట్లు ఈడీ అనుమానం వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అరెస్ట్ అయిన 15 మందితో పాటు చైర్మ‌న్ బి. జ‌నార్ద‌న్ రెడ్డి, సెక్ర‌ట‌రీ అనితా రామ‌చంద్ర‌న్ , స‌భ్యులను కూడా ఈడీ విచారించ‌నుంది. ఇక నిందితుల‌కు సంబంధించిన బ్యాంకు లావాదేవీల‌ను కూడా తెలియ చేయాల‌ని నోటీసులు జారీ చేసింది ఈడీ.

Also Read : టీఎస్పీఎస్సీని ర‌ద్దు చేయాలి – ఆర్ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!