Rahul Gandhi Bail : రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కామెంట్స్
Rahul Gandhi Bail : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది. గుజరాత్ కోర్టు 2 సంవత్సరాల శిక్షను వాయిదా వేసింది. మోదీ ఇంటి పేరు నేర పూరిత పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షను గుజరాత్ లోని సూరత్ కోర్టు పాజ్ చేయడం విశేషం. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్రగా అభివర్ణించింది. ఈ కేసుకు సంబంధించి సూరత్ కోర్టు ఇటీవలే రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi Bail)పిటిషన్ దాఖలు చేశారు.
నీరవ్ మోదీ, లలిత్ మోదీలు ఆర్థిక నేరస్థులుగా ఇప్పటికే ముద్ర పడ్డారు. ఈ మోదీలంతా కేడీలేనంటూ రాహుల్ గాంధీ ఒకానొక సందర్భంలో సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పరువు నష్టం దావా కేసు నమోదైంది 2019లో. దీనికి సంబంధించి సూరత్ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఇదే సమయంలో దేశంలో ప్రజాస్వామ్యం లేనే లేదని లండన్ లో చేసిన కామెంట్స్ కు క్షమాపణలు చెప్పాలని కేంద్ర సర్కార్ పట్టుపట్టింది.
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. చివరకు స్పీకర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పై అనర్హత వేటు వేశారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడు లోక్ సభ ఇప్పుడు ఖాళీ అయ్యింది. ఇదే సమయంలో పరువు నష్టం కేసుకు సంబంధించి రాహుల్ గాంధీ ఇవాళ గుజరాత్ కోర్టును ఆశ్రయించారు.
Also Read : అవినీతి దేశాభివృద్దికి అవరోధం – మోదీ